స్పోర్ట్స్ డెస్క్ : భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఎంతో ఉత్కంఠ కలిగించింది. చివరకు 4 రన్స్ తేడాతో దక్షిణాఫ్రికా, భారత్ పై విజయం సాధించింది. అలాగే 3-0 తేడాతో దక్షిణాఫ్రికా సిరీస్ ను కైవసం చేసుకుంది. కేవలం ఒకే ఒక్క వికెట్, ఫైనల్ ఓవర్ భారత్ కు 6 రన్స్ కావాలి. పెట్రోరియస్ చివరి ఓవర్ బౌలింగ్ చేశాడు.
క్రీజులో ఉన్న యజువేంద్ర చాహల్ ను ఔట్ చేసి దక్షిణాఫ్రికాకు విజయం అందించాడు. కేప్ టౌన్ వేదికగా జరిగిన థర్డ్ వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్, ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. 287 పరుగులు చేసి ఆలౌటై భారత్ కు 288 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. ఆ తర్వాత బ్యాటింగ్ బరిలోకి దిగిన భారత్ 49.2 ఓవర్లలో 283 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
2.