నా ఈ పరిస్థితికి ఆ ఎమ్మెల్యే కారణం..?

వరంగల్‌ అర్బన్‌ : జిల్లాలోని హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. అదాలత్‌ జంక్షన్‌ లోని అమరవీరుల స్థూపం వద్ద ఓ వ్యక్తి కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన పలువురు అతన్ని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని నెక్కొండ మండలం అలంఖానిపేటకు చెందిన మాసం వెంకటేశ్వర్లుగా గుర్తించారు. కాగా, తన చావుకు నర్సంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కారణమని బాధితుడు ఓ లేఖలో పేర్కొన్నాడు. సమాచారం తెలుసుకున్న సుబేదారి పోలీసులు కేసు దర్యప్తు చేస్తున్నారు.నా ఈ పరిస్థితికి ఆ ఎమ్మెల్యే కారణం..?