చైనాకు షాక్‌..టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధం

న్యూఢిల్లీ: చైనాకు భారత ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశ రక్షణ, భద్రతను దృష్టి పెట్టుకొని టిక్‌టాక్‌ సహా షేరిట్‌, యూసీ బ్రౌజర్‌, బైడు మ్యాప్‌, ఎంఐ కమ్యూనిటీ, క్లబ్‌ ఫ్యాక్టరీ తదితర 59 యాప్‌లను బ్యాన్‌ చేసింది.ఈ నెల 15న లడాఖ్ గాల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో ఓ కర్నల్‌ సహా 20 మందికి భారత సైనికులు మృతువ్యాత పడిన విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో దేశవ్యాప్తంగా చైనాకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆ దేశానికి చెందిన వస్తువులను, యాప్‌లను వినియోగించొద్దని, వాటిని బ్యాన్‌ చేయాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలువురు ఆ దేశంలో తయారైన వస్తువులను పగులగొట్టి మరీ తమ నిరసనను తెలుపుతున్నారు. మరియు కేంద్ర నిఘావర్గాలు సైతం దేశానికి చెందిన సమాచారం బయటి దేశానికి వెళ్తుందని, వాటిని బ్యాన్‌ చేయాలని, వాడకుండా ప్రజలకు పిలుపునివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రం ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.చైనాకు షాక్‌..టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధం

షీ ఇన్, క్ల‌బ్ ఫ్యాక్ట‌రీ, హెలో, లైకి, బ్యూటీ ప్ల‌స్, విగో వీడియో, క్లీన్ మాస్ట‌ర్ , క్యామ్ స్కాన‌ర్, ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోర‌ల్‌, వీ మేట్, క్లాష్ ఆఫ్ కింగ్స్, ఎమ్ ఐ వీడియో కాల్‌, హాగో యాప్,  వివిధ ర‌కాల యాప్ లు నిషేధిత జాబితాలో ఉన్నాయి.