మైక్రో పార్కు బాగుంది

మైక్రో పార్కు బాగుందివరంగల్ అర్బన్ జిల్లా: ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తన నియోజకవర్గం వరంగల్ తూర్పులో పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 19వ డివిజన్ శివనగర్ మైసయ్యనగర్ లో మైక్రో పార్కును ఎమ్మెల్యే ప్రారంభించారు. పార్కు మొత్తం కలియతిరిగిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పార్కులు అద్భుతంగా రూపొందించారని, పార్కు నిర్మాణంలో పనులు చేపట్టిన అధికారులను, ఆస్కీ రాజమోహన్, రతన్ నాయక్ , పార్కు కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరినీ ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం కాలనీవాసులతో ఎమ్మెల్యే కాసేపు ముచ్చటించి, అభివృద్ధి పనులపై ఆరా తీసారు, వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో టీఆర్ఎస్ ముఖ్యనాయకులు, మహిళా నాయకురాల్లు, కార్మిక సంఘం నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకు ముందు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖిలావరంగల్ కు చెందిన 10 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ఖిలా వరంగల్ ఎమ్మార్వో మంజుల , కార్పొరేటర్లు పాల్గొన్నారు.