రిజిస్ట్రేషన్ శాఖలో శని, ఆది సెలవులు రద్దు

రిజిస్ట్రేషన్ శాఖలో శని, ఆది సెలవులు రద్దుతెలంగాణ : వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ శాఖలో నేడు, రేపు సెలవులు రద్దు చేశారు. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు చేసేందుకు వీలుగా శుక్రవారం నుంచి స్లాట్లు బుక్ చేసుకుంటున్నారు. పూర్తి స్థాయి రిజిస్ట్రేషన్ల కోసం నేడు, రేపు డమ్మీ రిజిస్ట్రేషన్లు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణియించింది. ఇందుకోసం రెండు రోజుల పాటు జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బంది రెండు రోజులు పూర్తి స్థాయిలో అందుబాటులో వుండాలని ఆదేశించింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని జిల్లా రిజిస్ట్రార్లకు తెలిపారు. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ శేషాద్రి ఆదేశాలు జారీ చేశారు.