అమరావతి: ప్రముఖ సినీ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక తన భర్త చైతన్య, అత్తామామలతో కలిసి అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అలాగే వ్రతం కూడా చేశారు. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న నూతన దంపతులను ఆలయ అర్చకులు నవ దంపతులను ప్రత్యేకంగా ఆలయంలోకి ఆహ్వానించి ..వారితో ప్రత్యేక పూజలు చేయించారు. ఈనెల 09న చైతన్య జొన్నలగడ్డతో కొణిదెల నిహారిక, చైతన్య వివాహం ఉదయ్ పూర్ లో జరిగిన విషయం అందరికి తెలిసిందే.