ప్రశాంతంగా ముగిసిన పర్యటన

ప్రశాంతంగా ముగిసిన పర్యటన

వరంగల్ అర్బన్ జిల్లా: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి వరంగల్ నగరంలో పర్యటించి, వివిధ అభివృద్ధి పనుల పురోగతిని పర్యవేక్షించారు. కేంద్రమంత్రి హోదాలో వరంగల్ కు మొదటి సారిగా వచ్చిన కిషన్ రెడ్డి గ్రేటర్ వరంగల్ లో పలు అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ముందుగా వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ లో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున రావాల్సిన రూ.30 కోట్ల వాటా డబ్బులు పూర్తిగా రానందున ఈ ఆసుపత్రిలో పూర్తి స్థాయి వైద్య సేవలు ఇంకా ప్రారంభం కాలేదని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.కేంద్రం తన వాటా కింద రూ. 120 కోట్ల గాను ఇప్పటికే 106 కోట్లు నిధులు ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం ధోరణి వల్ల అత్యాధునిక వైద్య సేవలను, వరంగల్ ప్రజలు పొందలేకపోతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ చారిత్రక వారసత్వ సంపదకు వరంగల్ నగరం నిలువెత్తు నిదర్శనమని కిషన్ రెడ్డి అన్నారు. హృదయ్ పథకం కింద భద్రకాళి చెరువు కట్టకు సంబంధించిన పనుల పురోగతిని పరిశీలించారు. హృదయ్ పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తున్న, బుగ్గలోనిగుట్ట హనుమకొండలో గల చారిత్రక జైన్ హెరిటేజ్ ప్రాంతాన్ని కూడా సందర్శించారు.ప్రశాంతంగా ముగిసిన పర్యటన

టీఆర్ఎస్ అలసత్వం వల్లే పనుల్లో జాప్యం…
స్మార్ట్ సిటీస్ మిషన్ లో భాగంగా.. ప్రతి నగరానికి రూ.196 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనిలో 100 శాతం మొత్తాన్ని సంబంధిత స్పెషల్ పర్పస్ వెహికల్ కి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా బదిలీ చేయలేదు. తెలంగాణలో వరంగల్ తో పాటు కరీంనగర్ కూడా స్మార్ట్ సిటీ పథకంలో ఉన్నది. కాని ఈ రెండు స్మార్ట్ సిటీలకు కూడా రాష్ట్ర వాటాను తెలంగాణ రాష్ట్రం ఇంకా విడుదల చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. స్మార్ట్ సిటీ అడ్వైజరీ ఫోరం సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.ప్రశాంతంగా ముగిసిన పర్యటనవరంగల్ నగరంలో మొత్తం రూ.2,740 కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీ ప్రతిపాదనలు ఆమోదించారని, అందులో రూ.576.76 కోట్ల రూపాయల విలువైన వివిధ పనులకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి కాగా, కరీంనగర్‌లో కేవలం రూ.23 లక్షలు రూపాయల ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయని కేంద్ర మంత్రి తెలిపారు.

భద్రకాళి చెరువుకి సంబంధించి మొత్తం రూ.31.27 కోట్ల విలువైన పనులు జరిగాయని, అందులో హృదయ్ కింద రూ.21.27 కోట్లు కూడా ద్వారా రూ.10 కోట్లు ఖర్చు పెట్టారని మంత్రి అన్నారు. అలాగే జైన్ క్షేత్ర అభివృద్ధికి రూ.1.3 కోట్లు ఖర్చుపెట్టగా, వెయ్యి స్తంభాలగుడి.. ఆలయ ఆవరణ అభివృద్ధి, 13 జంక్షన్లలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ మరమ్మతులు జరిగాయని తెలిపారు. ఎంజిఎం ఆసుపత్రిలో మురుగునీటి శుద్ధి వ్యవస్థ ద్వారా రోజుకి 750 కిలో లీటర్ల మురుగునీటి శుద్ధి,సెంట్రల్ లైబ్రరీ పునరుద్దరణ జరిగాయని మంత్రి తెలిపారు.

పథకం ఏదైనా అభివృద్ధిలో జాప్యం వుండొద్దు…..
వరంగల్ నగరానికి సంబంధించినంత వరకు పథకం ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల్లో ఎటువంటి జాప్యం కలవకుండా అధికారులు చర్య తీసుకోవాలని శ్రీ కిషన్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తమవంతుగా వివిధ కార్యక్రమాలకు సంబంధించిన వాటాను తక్షణమే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

ప్రశాంతంగా ముగిసిన పర్యటన

అధికారులతో కేంద్రమంత్రి సమీక్షా…
హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్ హౌజ్ లో  రైల్వే శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో కాజీపేటలో నిర్మించ తలపెట్టిన వ్యాగన్ వర్క్ షాప్ ఏర్పాటుకి సంబంధించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చర్చించారు. కాజీపేట వ్యాగన్ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ కోసం ప్రభుత్వం రైల్వే శాఖ 2016 -17 లోనే మంజూరు చేయగా, సుమారు రూ.383 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించతలపెట్టిన ఈ వర్క్ షాప్ లో నెలకి 200 వ్యాగన్ల ఓవర్ హాలింగ్ జరిగే అవకాశం ఉందని మంత్రి అన్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు వెయ్యి మందికి పైగా శాశ్వత ఉద్యోగాలు దొరికే అవకాశం ఉందనీ, ఈ వర్క్ షాపు పనులు ప్రారంభించిన రెండు సంవత్సరాల మూడు మాసాల కాలంలో పూర్తి చేయాలని మంత్రి నిర్దేశించారు. పనుల ప్రారంభానికి అవసరమైన 160 ఎకరాల స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇంకా రైల్వేశాఖకు బదలాయించలేదని, దీంతో నిర్మాణం పనులు మొదలు కాలేదు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులతో వరంగల్ జిల్లా కలెక్టర్ తో రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 160 ఎకరాల స్థలాన్ని రైల్వే శాఖకు అప్పగించాలని, తక్షణమే స్పందించి చొరవ తీసుకొని కాజీపేట వ్యాగన్ వర్క్ షాప్ పనులు త్వరితగతిన ప్రారంభించడానికి చర్య తీసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. వరంగల్ నగరాన్ని స్మార్ట్ సిటీ గా గుర్తించడమే కాకుండా చారిత్రక వారసత్వ నగరాల జాబితాలో హృదయ్ పథకం కింద కూడా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.

బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా …
వరంగల్ టీవీఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర నేతలు, అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతో పాటు జిల్లా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. బీజేపీ పార్టీ పటిష్టత కు ప్రతిఒక్కరు పాటుపడాలంటూ కార్యకర్తలకు, నాయకులకు కిషన్ రెడ్డి దిశానిర్ధేశం చేశారు. ఈ సమావేశంలో భాగంగా బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని శాలువాలతో సన్మానించారు.

ప్రశాంతంగా ముగిసిన పర్యటన

కిషన్ రెడ్డి సమక్షంలో చేరికలు…
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ నాయకులు అచ్చ విద్యాసాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టా రాజశేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి, ఎర్రగట్టు గుట్ట దేవస్థానం మాజీ చైర్మన్ బూర సురేందర్ గౌడ్ , సినిమా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అడెపు శ్రీనివాస్, కుల సంఘం పెద్దలు సీత మధు, టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఖుదుస్, రోహిణి హాస్పటిల్ వైద్యురాలు డాక్టర్ ప్రియాంక, యువనాయకులు సురేష్ నాయక్, కార్తిక్, శ్రావణ్ తదితరులు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన ముగించుకుని రోడ్డు మార్గంలో వరంగల్ నుంచి సూర్యాపేటకు బయల్దేరారు.