చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్‌

చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్‌

చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్‌వరంగల్ టైమ్స్, ఆంధ్రప్రదేశ్ :

వరంగల్ టైమ్స్, తాడేపల్లి : టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు యాగీని, దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ తీరును ప్రజలు పరిశీలిస్తున్నారు అని అన్నారు. కాగా, మంత్రి అంబటి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వం తెచ్చిన జీవో అన్ని పార్టీలకు వర్తిస్తుందని అంబటి రాంబాబు తెలిపారు. చంద్రబాబు రోడ్‌షోలతో ఒరిగేది ఏమీ ఉండదు. చంద్రబాబు కాలుపెట్టిన చోట జనం పిట్టల్లా రాలిపోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో జీవో తీసుకువచ్చింది. ప్రభుత్వ జీవోపై చంద్రబాబు యాగీ చేస్తున్నారు. కుప్పంలో టీడీపీ సమాధి కావడం ఖాయమని అంబటి జోష్యం చెప్పారు. కుప్పం ప్రజలు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అభిమానిస్తున్నారని గుర్తు చేశారు.

కుప్పం ప్రజలు స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఘన విజయం అందించారు. ఓటమి భయంతోనే చంద్రబాబు పదే పదే కుప్పం వెళ్తున్నారు. చంద్రబాబుకు కుప్పంలో కనీసం ఇళ్లు లేదు, ఓటు లేదు. చంద్రబాబు యాగీని ప్రజలు గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవో1 వెనక్కి తీసుకునే ప్రస​‍క్తే లేదు. ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే జీవో1ను తీసుకువచ్చాము’ అని అంబటి తీవ్రంగా విమర్శలు చేశారు.