రేపు మోడీ భద్రతా సమస్యపై సుప్రీంలో విచారణ

రేపు మోడీ భద్రతా సమస్యపై సుప్రీంలో విచారణన్యూఢిల్లీ : పంజాబ్ లో ప్రధాని మోడీకి భద్రతా సమస్య ఏర్పడిన విషయం తెలిసిందే. ఫిరోజ్ పూర్ లో బహిరంగసభలో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని మోడీని రహదారిపై రైతులు అడ్డుకున్నారు. దీంతో మోడీ కాన్వాయ్ ఓ ఫ్లై ఓవర్ పై 20 నిమిషాల పాలు నిలిచిపోయింది.

ఈ ఘటనపై రేపు సుప్రీంకోర్టులో విచారణ చేపట్టనున్నారు. అయితే ఈ అంశంపై నేడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్ పర్యటనలో ప్రధాని మోడీకి ఎదురైన సమస్యపై రాష్ట్రపతి స్పందించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ ను మరికాసేపట్లో ప్రధాని మోడీ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.