కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చల్లా

కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చల్లాహనుమకొండ జిల్లా : అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్ధిక భారం తగ్గించేందుకై కళ్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టారని తెలిపారు. గురువారం హనుమకొండలోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కళ్మాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చల్లా

ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన సుమారు 100 మంది లబ్ధిదారులకు రూ. 1 కోటికి పైగా విలువ చేసే కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ సుపరిపాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిలా నిలిచేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.