రుద్రేశ్వరీ-రుద్రేశ్వరులకు ఘనంగా నాగవెల్లి

రుద్రేశ్వరీ-రుద్రశ్వరులకు ఘనంగా నాగవెల్లి

రుద్రేశ్వరీ-రుద్రేశ్వరులకు ఘనంగా నాగవెల్లివరంగల్ టైమ్స్, హనుమకొండ: సోమవారం చారిత్రిక రుద్రేశ్వర స్వామి వారి వేయి స్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజు మహాశివరాత్రి పర్వదినాన కల్యాణోత్సవం నిర్వహించుకున్న రుద్రేశ్వరి రుద్రేశ్వర స్వామి వార్లకు నాగవల్లి సదస్యం నిర్వర్తించారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఆది దంపతులకు గణపతి పూజ, నీలాంబరి పూజ (నల్ల పూసలు ) నీలా సూక్త మంత్ర పటంతో శ్రీ సూక్త మంత్ర పటంతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.నివేదన నీరాజన మంత్రపుష్పం అనంతరం వేద పండితులు వేద గోష్టితో మహాసదస్యం రుగ్వేదం,యజుర్వేదం, సామవేదం అధర్వణవేదాలలోని గణ మంత్రములతో వేదపండితులు ఘనంగా సదస్యం నిర్వర్తించారు.

ఈ నాగవల్లి కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వద్దిరాజు వెంకటేశ్వర్లు దంపతులు, మండవ శేషగిరిరావు, 11 మంది వేద పండితులు పాల్గొని స్వస్తి వేద పటంతో చేయడం జరిగినది. ఆలయ కార్య నిర్వహణ అధికారి డి.అనిల్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం రుద్రేశ్వర స్వామికి 51కిలోల పెరుగుఅన్నంతో అన్న సూక్త మంత్ర పటంతో మహా అన్నపూజ నిర్వర్తించడం జరుగుతుంది. ప్రాంగణంలో భక్తులకు అన్నదానం నిర్వర్తించడం జరుగుతుంది అని ఆలయ కార్య నిర్వాహణాధికారి డి.అనిల్ కుమార్ పేర్కొన్నారు