స్టూడెంట్స్, టీచర్స్ కి కరోనా..స్కూల్ కు సీల్

స్టూడెంట్స్, టీచర్స్ కి కరోనా..స్కూల్ కు సీల్ముంబై : మహారాష్ట్ర అహ్మద్ నగర్ లోని టాక్లీ ధోకేశ్వర్ లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 48 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అధికారులు ఆ స్కూల్ కి సీల్ వేశఆరు. స్కూల్ లో 5 నుంచి 12వ తరగతి వరకు 400 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులు, సిబ్బంది అందరికీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ లు చేసినట్లు పార్నర్ తాలూకా అధికారి ప్రకాశ్ లాల్గే తెలిపారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జవహర్ నవోదయ విద్యాలయంలోని 48 మంది విద్యార్థులు, ముగ్గురు సిబ్బందితో సహా 51 మంది కరోనా పాజిటివ్ గా పరీక్షించారు. వారందరినీ ఆస్పత్రిలో చేర్పించారు. చాలామంది విద్యార్థుల్లో లక్షణాలు ఏమీ లేవని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు చెప్పారు. విద్యార్థులు, సిబ్బంది కొవిడ్ బారినపడడంతో స్కూల్ కు సీల్ వేసి, ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు.