ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త చట్టం

ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త చట్టం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల పై తెలంగాణ సర్కార్ కొరడా ఝుళిపించనుంది. అటువంటి వారి జీతం నుంచి 10-15 శాతం కోత విధించి, ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేలా కొత్త చట్టాన్ని రూపొందిస్తోంది. 2023 తర్వాత విధుల్లో చేరిన వారికి ఇది వర్తించనుంది. సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ రూపొందించిన ఈ ముసాయిదాను త్వరలోనే తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు