లండన్ : దక్షిణాసియా నెం.1 సెలబ్రిటీగా రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచారు. ఈ సంవత్సరానికిగానూ బ్రిటన్ వార పత్రిక ఈస్ట్రన్ ఐ ఈ జాబితాను రూపొందించింది. గ్లోబల్ స్టార్లను వెనక్కి నెట్టి ప్రభాస్ మొదటి స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.
రెండో స్థానంలో బ్రిటీష్- పాక్ నటుడు రిజ్ అహ్మద్ నిలువగా, మూడో స్థానంలో ప్రియాంక చోప్రా, నాల్గో స్థానంలో ఇండియన్ అమెరికన్ మిండీ కలింగ్ , ఐదో స్థానంలో గాయని శ్రేయా ఘోషల్ నిలిచారు.