రాష్ట్ర స్థాయి కబడ్డీ విజేత వరంగల్, నల్లగొండ

రాష్ట్ర స్థాయి కబడ్డీ విజేత వరంగల్, నల్లగొండజనగామ జిల్లా : కాకతీయ రాష్ట్ర స్థాయి కబడ్డీ చాంపియన్ షిప్ లో వరంగల్ ( మహిళల), నల్లగొండ ( పురుషుల) జట్టు విజేతలుగా నిలిచాయి. బతుకమ్మకుంట వేదికగా గురువారం జరిగిన మహిళల ఫైనల్లో వరంగల్ ( డీసీసీ జనగామ ) జట్టు 35- 30 తేడాతో హైదరాబాద్ ఉత్కంఠ విజయం సాధించింది.

మరోవైపు పురుషుల తుదిపోరులో నల్లగొండ 40-30 తేడాతో వరంగల్ పై విజయాన్నందుకుంది. టోర్నీలో విజేతలుగా నిలిచిన వరంగల్, నల్లగొండ జట్లకు చెరో రూ.60వేలు, ద్వితీయ స్థానాల్లో ఉన్న టీమ్ లకు రూ.40 వేలు అందించారు. ఈ పోటీల ముగింపు కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి, వరంగల్ సీపీ తరుణ్ జోషి విజేతలకు ట్రోఫీలు బహుకరించారు.