ముగిసిన బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు

ముగిసిన బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలున్యూఢిల్లీ : త్రిదళాధిపతి బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక పార్థీవ దేహాలకు పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు ముగిశాయి. 17 ఫిరంగులతో గన్ సెల్యూట్ చేశారు. వారి కుమార్తెలు కృతిక, తరిణి అంత్యక్రియల్లో పాల్గొని చితికి నిప్పంటించారు. త్రివిధ దళాలకు చెందిన 800 మంది సైనికులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

ఢిల్లీ కామ్రాజ్ మార్గ్ లోని రావత్ నివాసం నుంచి రావత్ దంపతల అంతిమయాత్ర కొనసాగింది. ఢిల్లీ కంటోన్మెంట్ లోని బ్రార్ స్క్వేర్ లోని శ్మశానవాటిక వరకు సాగిన ఈ అంతిమ యాత్రలో ప్రజలు, ప్రముఖులు, ప్రజాప్రజానిధులు, సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకు ముందు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, పలువురు నేతలు రావత్ దంపతుల భౌతిక కాయాలకు నివాళులర్పించారు.