కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు రేపటి నుంచి అమలు

కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు రేపటి నుంచి అమలుహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరింపు కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రివిజన్ ఆఫ్ మార్కెట్ వాల్యూస్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ 1998 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువలు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

పెరిగిన మార్కెట్ విలువలు రేపట్నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ రుసుము కట్టిన వారికి కొత్త ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. పాత విలువలతోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింపునకు వెసులుబాటు కల్పించారు. రేపట్నుంచి 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొత్త మార్కెట్ విలువలు అమలుకానున్నాయి.