భారత్ లో కొత్తగా 2.86 లక్షల పాజిటివ్ కేసులు

భారత్ లో కొత్తగా 2.86 లక్షల పాజిటివ్ కేసులున్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నది. ప్రతీ రోజు 2 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. బుధవారం 2.85 లక్షల కేసులు నమోదవగా, తాజాగా అవి 2.86 లక్షలకు చేరాయి. అదే విధంగా యాక్టివ్ కేసులతో పాటు, రోజువారీ పాజిటివిటీ రేటు కూడా పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో కొత్తగా 2,86,384 కరోనా పాజిటివ్ కేసులు నమోయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,03,71,500కు చేరాయి. ఇందులో 3,76,328 మంది కోలుకున్నారు. 22,02,472 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మరో 4,91,700 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.

బుధవారం ఉదయం నుంచి ఇప్పటి వరకు 573 మంది మృతి చెందారని, 3,06,357 మంది వైరస్ నుంచి బయటపడ్డారని ఆరోగ్యశాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 19.59 శాతానికి చేరిందని వెల్లడించింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా 1,63,84,39,207 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఇక ఒమిక్రాన్ కేసులు 8209 కి చేరాయి. ఇందులో 3109 మంది కోలుకున్నారని తెల్పింది. మరో 5100 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని వెల్లడించింది. భారత్ లో ఒమిక్రాన్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో 1738 నమోదయ్యాయి. పశ్చిమబెంగాల్ లో 1672, రాజస్థాన్ లో 1276, ఢిల్లీలో 549 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.