కాశీలో కాలభైరవుడిని దర్శించుకున్న ప్రధాని మోడీ

కాశీలో కాలభైరవుడిని దర్శించుకున్న ప్రధాని మోడీవారణాసి : భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు కాశీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే మొదటగా బాబా కాలభైరవుడిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత పూజలు, అర్చనలు చేశారు. దీనిలో భాగంగానే కాలభైరవుడికి ప్రధాని మోడీ హారతి ఇచ్చారు.ఈ క్రమంలోనే మోడీని కలిసేందుకు భారీ సంఖ్యలో జనం కాలభైరవ ఆలయానికి తరలివచ్చారు.

ఆలయంలో ఉన్న భక్తులతో కాసేపు మోడీ గడిపారు. వారికి అభివాదం చేశారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ ను నేడు ప్రధాని మోడీ ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 244 సంవత్సరాల తర్వాత కాశీ విశ్వనాథ ఆలయ పునర్ నిర్మాణం జరుగుతోంది.