తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడా వర్షాలు 

తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడా వర్షాలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తూర్పు విదర్భ, పరిసర ప్రాంతాల నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టానికి సుమారు 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.