రెండో రోజు 522 మంది 580 నామినేషన్ల దాఖలు

హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభమైన రెండో రోజు (గురువారం) 522 మంది అభ్యర్థులు 580 నామినేషన్లను దాఖలు చేశారు. దీంతో ఇప్పటి వరకు 537 మంది అభ్యర్థులు 597 నామినేషన్లను దాఖలు చేశారు. నేడు నామినేషన్లు దాఖలు చేసినవారిలో బి.జె.పి నుండి 140 మంది, సి.పి.ఐ నుండి ఒకరు, సి.పి.ఐ(ఎం) నుండి నలుగురు, కాంగ్రెస్ నుండి 68, ఎం.ఐ.ఎం నుండి 27, టి.ఆర్.ఎస్ నుండి 195 మంది, టి.డి.పి నుండి 47, వైఎస్సార్ సిపి నుండి ఒకరు, రికగనైజ్డ్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీల నుండి 15 మంది, స్వతంత్రులు 110 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాగా రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుంది.