కొత్త పార్లమెంట్​కు ముహూర్తం ఖరారు

కొత్త పార్లమెంట్​కు ముహూర్తం ఖరారు

ఢిల్లీ : ఢిల్లీలో కొత్త పార్లమెంట్​ భవన నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ భవన నిర్మాణానికి ఈ నెల 10న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మరియు ప్రధాని నరేంద్రమోదీ, భూమిపూజ చేయనున్నారు. ఈ భవనాన్ని రూ .861.9 కోట్ల వ్యయంతో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగు అంతస్తులలో భారీగా నిర్మించనున్నారు. టాటా సంస్థకు ఈ భవన నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. కేవలం 22 నెలల కాలంలోనే ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పార్లమెంట్ భవనం పక్కనే ఈ కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. అయితే కరోనా కాలంలో ఈ కొత్త పార్లమెంట్​ భవనం నిర్మించడం పట్ల ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

కొత్త పార్లమెంట్​కు ముహూర్తం ఖరారు