ఎమ్మెల్సీ స్థానానికి 21 నామినేషన్లు చెల్లుబాటు

ఎమ్మెల్సీ స్థానానికి 21 నామినేషన్లు చెల్లుబాటు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : హైదరాబాద్ లోకల్ అథారిటీ ఎమ్మెల్సీ, మహబూబ్ నగర్- రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు వేసిన నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలా శుక్రవారం నాడు పరిశీలించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఇద్దరు నామినేషన్ లు వేశారు.

అందులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మహమ్మద్ రహీం ఖాన్ దాఖలు చేసిన నామినేషన్ ను రిటైనింగ్ అధికారి తిరస్కరించారు. తమ నామినేషన్ పత్రాలలో పదిమంది బలపరిచిన వారు ఓటర్లు కానందున తిరస్కరించినట్లు అధికారి తెలిపారు. మహబూబ్ నగర్- రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 21 మంది నామినేషన్లలో ఏ ఒక్కటి కూడా తిరస్కరించబడలేదని రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు.