గొర్రెకుంట మృత్యుబావి కేసులో మరో తీర్పు

గొర్రెకుంట మృత్యుబావి కేసులో మరో తీర్పువరంగల్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట మృత్యుబావి ( 9మంది హత్య ) కేసులో వరంగల్ పోక్సో కోర్టు మరో కీలక తీర్పును వెల్లడించింది. ఇప్పటికే ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని హత్య కేసులో నేరస్తుడు సంజయ్ కుమార్ కు కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే మరో కేసులో వరంగల్ పోక్సో కోర్టు జీవిత ఖైదు విధించింది. దోషి సంజయ్ కుమార్ జీవించి ఉన్నంత కాలం జైల్లోనే వుండాలని వరంగల్ పోక్సో కోర్టు ప్రత్యేక జడ్జి కావూరి జయకుమార్ తీర్పు వెల్లడించారు. హత్యకు గురైన కుటుంబానికి చెందిన ఒక మైనర్ బాలికపై సంజయ్ అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో కోర్టు జీవిత ఖైదు విధించింది. బాధిత బాలికకు పరిహారంగా రూ. 4లక్షలు అందించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఇలాంటి కేసుల్లో పెద్ద మొత్తాన్ని పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించడం దేశంలో ఇదే మొదటిసారి కావడం విశేషం.