రాష్ట్రంలో గ్రూప్- 3 నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలో గ్రూప్- 3 నోటిఫికేషన్ విడుదల

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : తెలంగాణలో నిన్న గ్రూప్- 2 నోటిఫికేషన్ విడుదల కాగా, తాజాగా గ్రూప్- 3 నోటిఫికేషన్ విడుదలైంది. 1365 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 తేదీ మధ్యలో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 783 గ్రూప్- 2 పోస్టులకు నిన్న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. తదితర వివరాల కోసం www.tspsc.gov.in అనే వెబ్ సైట్ ను సందర్శించొచ్చు.
ఇప్పటికే గ్రూప్- 1, గ్రూప్- 4 నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. గ్రూప్- 1 ప్రిలిమినరీ ఫలితాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి.