తొలి వన్డేలో టీమిండియా విక్టరీ

తొలి వన్డేలో టీమిండియా విక్టరీతొలి వన్డేలో టీమిండియా విక్టరీ

 

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఉప్పల్ స్టేడియంలో జరిగిన భారత్ , న్యూజిలాండ్ తొలి వన్డే క్రికెట్ ఫ్యాన్స్ కు థ్రిల్లింగ్ ను పంచింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో టీమిండియా 12 పరుగుల తేడాతో గెలిచింది. చివరి ఓవర్ లో 20 పరుగులు అవసరమైన దశలో బ్రేస్ వెల్ తొలి బంతికే సిక్స్ కొట్టాడు. ఆ తర్వాతి బంతికి ఎల్బీగా ఔటయ్యాడు. దీంతో 337 పరుగులకు కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

మొదట శుభ్ మన్ గిల్ సిక్సర్లతో విరుచుకుపడి డబుల్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కివీస్ బ్యాటర్ మైఖేల్ బ్రేస్ వెస్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ శతకం బాదాడు. మ్యాచ్ చేజారినా కూడా అభిమానులకు కావాల్సినంత మజా దొరికింది. ఫిన్ అలెన్ (40) రాణించాడు.