బర్త్ డే కి న్యూ లుక్ లో వెంకీ

బర్త్ డే కి న్యూ స్టైలిష్ లుక్ లో అదరకొడుతున్న విక్టరీ వెంకటేష్
బర్త్ డే కి న్యూ లుక్ లో వెంకీ

హైదరాబాద్​ : ఎన్నో మరపురాని ఘన విజయాలను సాధించి ‘విక్టరీ’ నే తన ఇంటి పేరుగా చేసుకున్న వెంకటేష్ దగ్గుబాటి జన్మదినం డిసెంబర్ 13. ప్రస్తుతం ‘నారప్ప’ గా పవర్ ఫుల్, ఇంటెన్స్ రోల్ లో కనిపిస్తున్న వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించి క్లిప్స్​ ఈ రోజు (డిసెంబర్ 12) రాత్రి 8:00 గం లకు విడుదల చేయనున్నారు. ‘నారప్ప’ తర్వాత బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్​3’ చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఈ పుట్టినరోజుకు వెంకటేష్ న్యూ ఫోటోషూట్ స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. ఈ స్టిల్స్ లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో, గెడ్డంతో స్టైలిష్ గా వెంకీ అదరకొడుతున్నారు. ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చిన ఈ స్టిల్స్ క్యాజువల్ గా తీసినవే అని చెప్తున్నప్పటికీ, ఫ్యూచర్ లో రాబోయే ఫిల్మ్ లో కచ్చితంగా ఈ స్టైలిష్ లుక్ తో విక్టరీ వెంకటేష్ ప్రేక్షకులను అభిమానులను అలరించనున్నారని తెలుస్తోంది. ఇంతకీ అది ఏ చిత్రంలో ఉంటుందో వెయిట్ అండ్ సీ…

బర్త్ డే కి న్యూ లుక్ లో వెంకీ