మల్లన్న లగ్గానికి అంతా సిద్ధం 

మల్లన్న లగ్గానికి అంతా సిద్ధం

మల్లన్న లగ్గానికి అంతా సిద్ధం 

వరంగల్ టైమ్స్, సిద్ధిపేట జిల్లా : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. కల్యాణ వేడుకను వైభవోపేతంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని నలు మూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ నుంచి భక్తులు తరలిరానున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు మంచినీరు, చలువ పందిళ్లు, వాహనాల కోసం పార్కింగ్ స్థలాలు ఏర్పాట్లు చేశారు.

ప్రతీ యేడాది మార్గశిర మాసం చివరి ఆదివారం కొమురవెల్లి మల్లన్న కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కల్యాణం అనంతరం స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి, భక్తులను స్వామివారిని దర్శనానికే అనుమతించనున్నారు. కల్యాణ మహోత్సవం సందర్భంగా సాయంత్రం 7 గంటలకు మల్లికార్జున స్వామి రథోత్సవం నిర్వహించనున్నారు.

స్వామివారి ఆగమన శాస్త్రం ప్రకారం గొల్ల కేతమ్మ మేడలాదేవీలతో, మల్లన్న కల్యాణం తోట బావి వద్ద ఏర్పాటు చేసిన మండపంలో వివాహ వేడుల జరుగనున్నది. ప్రభుత్వం తరపున ఆర్థిక, దేవాదాయశాఖ మంత్రులు హరీశ్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు, స్వర్ణ కిరీటం సమర్పించనున్నారు. అనంతరం ముఖ మండపానికి ప్రారంభోత్సవం చేయనున్నారు.