టీ20 లో ఆస్ట్రేలియా వుమెన్స్ దే సిరీస్

టీ20 లో ఆస్ట్రేలియా వుమెన్స్ దే సిరీస్

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : టీమిండియా వుమెన్స్ తో జరిగిన 4వ టీ20 లో ఆస్ట్రేలియా వుమెన్స్ 7 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. దీంతో ఆస్ట్రేలియా వుమెన్స్ 5 మ్యాచ్ ల సిరీస్ ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. 189 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వుమెన్స్ జట్టు ఆఖరి వరకు సక్సెస్ కోసం పోరాడినప్పటికీ ఒత్తిడి జయించలేక చతికిలపడింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి విజయానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. టీం ఇండియా మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 30 బంతుల్లో 46 పరుగులు తీసి టాప్ స్కోరర్ గా నిలిచింది.టీ20 లో ఆస్ట్రేలియా వుమెన్స్ దే సిరీస్ఆస్ట్రేలియా బౌలర్లలో అష్లీ గార్డెనర్, అలానా కింగ్ చెరో 2 వికెట్లు తీయగా, డార్సీ బ్రైన్ ఒక వికెట్ తీసింది. అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. పెర్రీ 42 బంతుల్లో 72 పరుగులకు నాటౌట్ గా నిలవగా , గార్డెనర్ 27 బంతుల్లో 42 పరుగులు, హేలీ 30 పరుగులు చేసింది. నిలిచాడు. చివర్లో రిచా ఘోష్ 19 బంతుల్లో 40 నాటౌట్ గా రాణించింది.