కేసీఆర్ కప్ 2026– 8వ సీజన్ ఘన ప్రారంభం

కేసీఆర్ క్రికెట్ కప్ 2026– 8వ సీజన్ ఘన ప్రారంభం

-క్రీడలు యువతలో పోరాట పటిమను పెంపొందిస్తాయి :
దాస్యం వినయ్ భాస్కర్
-40కు పైగా జట్లతో ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా పోటీలుకేసీఆర్ కప్ 2026– 8వ సీజన్ ఘన ప్రారంభంవరంగల్ టైమ్స్, హనుమకొండ: కాకతీయ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రాష్ట్ర సాధకుడు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న “కేసీఆర్ క్రికెట్ కప్ 2026 – 8వ సీజన్” గురువారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఘనంగా ప్రారంభమైంది.
క్రీడా ఉత్సాహంతో నిండిన వాతావరణంలో ఈ టోర్నమెంట్‌కు శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ హాజరై పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ముందుగా జెండా ఆవిష్కరణ చేసి, క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ప్రారంభ బంతి వేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర అపూర్వమని పేర్కొన్నారు.ఉద్యమకారుడు, రాష్ట్ర నిర్మాణ శిల్పి, అభివృద్ధి ప్రదాతగా కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

క్రీడలు యువతకు క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలు నేర్పుతాయని, గ్రామీణ మరియు కింది స్థాయిలో ఉన్న ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను వెలికి తీసి వారికి వేదిక కల్పించాలనే లక్ష్యంతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ టోర్నమెంట్ ప్రస్తుతం 8వ సీజన్‌కు చేరుకోవడం గర్వకారణమని తెలిపారు. చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ పోటీలు, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడా వేదికగా మారాయని చెప్పారు. అనేక క్రీడా టోర్నమెంట్లకు మార్గదర్శకంగా నిలుస్తూ, యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ టోర్నమెంట్‌ను ప్రతి సంవత్సరం విజయవంతంగా నిర్వహిస్తున్న కేసీఆర్ ఆర్గనైజర్స్ మరియు కాకతీయ క్రికెట్ అకాడమీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.కాగా ఈ టోర్నమెంట్ ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగనుంది. దాదాపు 40కు పైగా జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి.

ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగి ప్రేక్షకులను అలరించనుందని నిర్వాహకులు తెలిపారు. యువకులు, విద్యార్థులు మరియు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పోటీలను వీక్షించి, క్రీడాకారులను ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఈ టోర్నమెంట్ ద్వారా భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో మెరుస్తున్న క్రీడాకారులు తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ టోర్నమెంట్‌లో విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు ప్రకటించారు. మొదటి బహుమతి: ₹51,116/-🥈 రెండవ బహుమతి: ₹31,116/- అదనంగా, ఉత్తమ బ్యాట్స్‌మన్, ఉత్తమ బౌలర్, ఉత్తమ ఆల్‌రౌండర్ మరియు మాన్ ఆఫ్ ది మ్యాచ్‌లకు ప్రత్యేక బహుమతులు కూడా అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి మరియు నిర్వాహకులు షాకీర్, అస్లాం, వీరు, సిరాజ్, రాజేష్, రాంబాబు, కార్పొరేటర్స్ డివిజన్ ప్రెసిడెంట్ మాజీ కార్పొరేటర్స్,క్రీడా సంఘాల ప్రతినిధులు, యువకులు, విద్యార్థులు మరియు క్రీడాభిమానులు పాల్గొన్నారు.