యువకుడి ఇంటికి నిప్పు.. కారణం ఏంటంటే ! 

యువకుడి ఇంటికి నిప్పు.. కారణం ఏంటంటే !

వరంగల్ టైమ్స్, కరీంనగర్ జిల్లా : ప్రేమపెళ్లి చేసుకున్నారన్న కోపంతో ప్రియుడి ఇంటికి నిప్పంటించారు ప్రియురాలి కుటుంబసభ్యులు. ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ లో చోటు చేసుకుంది. హుజురాబాద్ కు చెందిన ఓ జంట గత కొన్నేండ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఐతే తమ ప్రేమను పెద్దలు అంగీకరించరనే భయంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పారిపోయారు. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెల్సింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ప్రియురాలి కుటుంబసభ్యులందరూ యువకుడి ఇంటికి వెళ్లారు.

ఇంకేముంది .. కోపోద్రిక్తంలో ఉన్న కుటుంబసభ్యులు ప్రియుడి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో ఇంట్లో ఉన్న ఫర్నీచర్, విలువైన వస్తువులు కాలిపోయాయి. అయితే సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.