ప్రవీణ్ సత్తారు డైరక్షన్‌లో వరుణ్ తేజ్ కొత్త చిత్రం
వరంగల్ టైమ్స్ , సినిమా డెస్క్ : వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ, యూత్ పల్స్ తెలుసుకుని ముందుకు సాగుతున్న ట్రెండీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్. ఆయన తాజాగా మరో సబ్జెక్ట్ ని ఓకే చేశారు. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న 12వ సినిమా ప్రారంభోత్సవం సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ఆత్మీయుల సమక్షంలో జరిగింది. జెన్ నెక్స్ట్ కథలతో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సినిమాలు తెరకెక్కిస్తారనే పేరున్న ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.నాగబాబు కొణిదెల సమర్పణలో బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. సినిమాటోగ్రఫీని ముఖేష్ హ్యాండిల్ చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి వరుణ్‌తేజ్ మాతృమూర్తి పద్మజ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వరుణ్‌తేజ్ తండ్రి నాగబాబు క్లాప్‌కొట్టారు. వారిద్దరూ సంయుక్తంగా స్క్రిప్ట్ అందజేశారు. ఎస్వీసీసీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా ఇది. ఇతర నటీనటులు, టెక్నీషియన్లు, షూటింగ్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు.
SVCC’s new film with Varun Tej and director Praveen Sattaru starts off in style