మహా నగరంపై మంచు దుప్పటి

మహా నగరంపై మంచు దుప్పటివరంగల్ : వరంగల్ మహా నగరం పై మంచు దుప్పటి కప్పుకున్నది. మంగళవారం తెల్లవారు జాము నుండే వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాలను పూర్తిగా మంచు కప్పేసింది. తెల్లవారుజామున 3, 4 గంటలకే పూర్తిగా మంచు కప్పేయడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఉదయం 7 గంటల వరకూ లైట్లు వేసుకుని వాహనాలు నడిపారు. మంగళవారం నుండే విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం కావడంతో విద్యార్థులు చలిలోనే బస్సులు, ఇతర వాహనాలలో పాఠశాలలు, కళాశాలలకు తరలి వెళ్లారు.