రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సార్వత్రిక సమ్మె

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సార్వత్రిక సమ్మె

వరంగల్ టైమ్స్ ,హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పలు జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 28, 29 తేదీలల్లో సార్వత్రిక సమ్మె చేయాలని పిలుపునిచ్చాయి. అందులో భాగంగా పలు చోట్ల కార్మికుల ర్యాలీలు నిర్వహించారు. మరోవైపు సింగరేణి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో బొగ్గు గనుల ఆవరణలు అన్ని బోసిపోయి కనిపించాయి.రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సార్వత్రిక సమ్మెప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలనే ఎజెండాగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా హనుమకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన ధర్నా కేంద్రాలకు దాస్యం వినయ్ భాస్కర్ ద్విచక్ర వాహనాలపై వెళ్లి మద్దతు తెలిపారు.