ఇది ఒక్క బీఆర్ఎస్ కే సాధ్యం : వాసుదేవ రెడ్డి

ఇది ఒక్క బీఆర్ఎస్ కే సాధ్యం : వాసుదేవ రెడ్డి

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : దేశంలోనే వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఉత్తమ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమని వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి అన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం అవార్డుతో కితాబిచ్చిందని ఆయన గుర్తు చేశారు. మలక్ పేట్ చౌరస్తాలోని వికలాంగుల సంక్షేమశాఖ రాష్ట్ర కార్యాలయంలో డైరెక్టర్ శైలజతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాసుదేవరెడ్డి మాట్లాడారు. దేశంలో రాష్ట్రాలలో వికలాంగులకు వెయ్యికి మించి ఫించన్లు ఇవ్వడం లేదని, కేవలం తెలంగాణ ప్రభుత్వమే ఒక్కో వికలాంగుడికి రూ.3016 చొప్పున అందిస్తున్నదని తెలిపారు.ఇది ఒక్క బీఆర్ఎస్ కే సాధ్యం : వాసుదేవ రెడ్డిదివ్యాంగులలో సామర్థ్యం చూడాలని, పనితనం చూడాలని వారిని చిన్నచూపు చూడొద్దని ఆశాభావం వ్యక్తం చేశారు. వికలాంగుల సంక్షేమం కోసం అన్ని రంగాలలో 5 శాతం రిజర్వేషన్, ఉద్యోగాలకు 4 శాతం, విద్యలో 3 నుంచి 4 శాతం పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నంని గుర్తు చేశారు. దేశంలోనే కల్యాణ లక్ష్మీతో పాటు దివ్యాంగుల కోటా కలుపుకుని దివ్యాంగుడి పెళ్లికి రూ.2.25 లక్షలతో చేయూతనిస్తుందని వాసుదేవరెడ్డి వివరించారు. అంధుల ప్రదాత లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా మలక్ పేట్ పార్కులో బ్రెయిలీ విగ్రహాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు.