రైతులకు టీ సర్కార్ గుడ్ న్యూస్

రైతులకు టీ సర్కార్ గుడ్ న్యూస్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ తెల్పింది. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు.రైతులకు టీ సర్కార్ గుడ్ న్యూస్రైతు బంధు నిధులు, ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి ప్రారంభమై సంక్రాంతి వరకు రైతులందరి ఖాతాల్లో జమకానున్నాయి. దీనికోసం రూ. 7,600 కోట్లను, రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది.