దమ్మాయిగూడ చిన్నారి మృతిపై వీడిన మిస్టరీ
వరంగల్ టైమ్స్, క్రైం డెస్క్ : నగరంలోని దమ్మాయిగూడ చిన్నారి మృతి కేసులో మిస్టరీ వీడింది. ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో ఇందు మృతి చెందిందని డాక్టర్లు తమ నివేదికలో వెల్లడించారు. జవహర్ నగర్ కు చెందిన ఇందు, ఈ నెల 15న దమ్మాయిగూడలోని స్కూల్ కు వెళ్లి అదృశ్యమైంది. మరుసటి రోజు ఉదయం పోలీసులు ఆమె మృతదేహాన్ని దమ్మాయిగూడలోని అంబేద్కర్ నగర్ చెరువులో గుర్తించిన విషయం తెలిసిందే. అయితే ఇందు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మూత్ర విసర్జన కోసం చెరువు వద్దకు వెళ్లి కాలుజారి పడినట్లు నిర్ధారించారు. ఇక ఇందు మృతిపై అనుమానాలు లేవని పోస్టుమార్టం నివేదికలో వైద్యులు వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో ఆమె మరణించినట్లు గుర్తించారు.