తొర్రూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
వరంగల్ టైమ్స్,జనగామ జిల్లా: తొర్రూరు మున్సిపల్ కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సోమవారం మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కౌన్సిలర్ లు, ముఖ్య నేతలు తొర్రూరు మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కాసేపట్లో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో రెండు పార్టీల నేతలు పోటీపోటీగా నినాదాలు చేస్తున్నారు. తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా, 9 వార్డుల్లో బీఆర్ఎస్ భారీ విజయం సాధించింది. ఏడు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీంతో ఇక్కడ ఎక్స్ అఫిషియో మెంబర్ల ఓట్లు కీలకంగా మారాయి.














