ఎర్రబెల్లి పీఏపై కాంగ్రెస్ గూండాల దౌర్జన్యం

ఎర్రబెల్లి పీఏపై కాంగ్రెస్ గూండాల దౌర్జన్యం

ఎర్రబెల్లి పీఏపై కాంగ్రెస్ గూండాల దౌర్జన్యంవరంగల్ టైమ్స్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఓటమిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ అధికార అహంకారంతో, పోలీసుల అండతో దాడులకు తెగపడుతోంది. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా మేయర్లు, డిప్యూటీ మేయర్ లు, మున్సిపల్ చైర్మన్లు, వైఎస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. స్పష్టమైన మెజార్టీ ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నిక సజావుగా సాగుతోంది. కానీ హంగ్ వచ్చిన పలు మున్సిపాలిటీల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆయా మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో పలు మున్సిపాలిటీల్లో ఘర్షణలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ బీఆర్ఎస్ కు మెజార్టీ వచ్చినా ఎక్స్ అఫిషియో మెంబర్ల ఓట్లతో బలాబలాలు సమానం అయ్యాయి. దీంతో ఇక్కడ డ్రా తీసి చైర్మన్, వైస్ చైర్మన్ ను ఎంపిక చేసే అవకాశం ఉంది.ఎర్రబెల్లి పీఏపై కాంగ్రెస్ గూండాల దౌర్జన్యంఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు భారీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని పోటీపోటీగా నినాదాలు చేశారు. ఫలితంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యాలయానికి చేరుకోగా, ఎర్రబెల్లి పీఏపై కొంతమంది కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడ్డారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా అక్రమంగా పోలీసులు నిర్బంధించారు. దీంతో ఎర్రబెల్లి సతీమణి ఉషా దయాకర్ రావు, బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తొర్రూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడంతో సుమారు 100 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టాయి. తొర్రూరు మున్సిపల్ కార్యాలయం చుట్టూ సుమారు 200 మీటర్ల 144 సెక్షన్ అమలు చేశాయి.ఎర్రబెల్లి పీఏపై కాంగ్రెస్ గూండాల దౌర్జన్యంతొర్రూలో మొత్తం 16 వార్డులుండగా, బీఆర్ఎస్ 9,కాంగ్రెస్ 7 చోట్ల గెలుపొందాయి. ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలిద్దరూ కాంగ్రెస్ మద్దతుదారులు కావడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ బలాబలాలు సమానంగా మారాయి. దీంతో డ్రా ద్వారా చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే వరంగల్ లో ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా ఎంపీ కడియం కావ్య పేరు ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీనిపై చట్టపరంగా ముందుకెళ్తామని ఆ పార్టీ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు యాళ్ల మురళీధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కడియం కావ్య తొర్రూరులో ఓటు ఎలా వేస్తుందని ప్రశ్నించారు.

2025లోనే వరంగల్ కార్పొరేషన్ లో ఆమె ఓటు హక్కు తీసుకున్నాక అవసరం కోసం ఇప్పుడు తొర్రూరు వస్తా అంటే ఎట్లా అని కలెక్టర్ కు తెలిపారు. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో ఎంపీ కడియం కావ్యకు ఓటు వేసే అవకాశం ఇవ్వొద్దని కలెక్టర్ ను కోరారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తొర్రూరులో ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాగా, అధికారులు అడ్డుకున్నారు. రాజ్యసభ సభ్యులు తమకు ఓటు ఉన్న ప్రాంతంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. ఆయనను ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఓటు వేసేందుకు అనుమతించలేదు. దీంతో ఆయన ఈ అంశంపై కోర్టుకు వెళ్తానని చెప్పారు.