మార్చి 1 నుంచి అందుబాటులోకి ‘RailOne’యాప్
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: భారతీయ రైల్వే శాఖ మార్చి 1, 2026 నుంచి యూటీఎస్ (UTS)మొబైల్ యాప్ ను మూసివేసి, దానిని కొత్త Railone యాప్ తో భర్తీ చేయనుంది. దీనిద్వారా అన్ని టికెట్-బుకింగ్ సర్వీసులు ఒకే ప్లాట్ ఫాంలోకి వస్తాయి. RailOneరిజర్వ్, అర్రిజర్వ్ టికెటింగ్, లైవ్ ట్రైన్ స్టేటస్, జర్నీ ప్లానింగ్, డిజిటల్ చెల్లింపులకు ఇది మద్దతు ఇస్తుంది. వినియోగదారులకు సజావుగా, ఏకీకృత ప్రయాణ బుకింగ్ అనుభవాన్ని అందిస్తుంది












