24 గంటల్లో కరోనాతో 959 మంది మృతి

24 గంటల్లో కరోనాతో 959 మంది మృతిన్యూఢిల్లీ : భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఆదివారం 2.34 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 2.09 లక్షల కేసులు రికార్డయ్యాయి. ఇది నిన్నటికంటే 10 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా పాజిటివిటీ రేటు కూడా తగ్గుతూ వస్తున్నదని తెలిపింది. దేశవ్యాప్తంగా కొత్తగా 2,09,918 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,13,02,440 కు చేరాయి. ఇందులో 3,89,76,122 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

18,31,268 మంది కరోనా నుంచి కోలుకోగా, 4,95,050 మంది మృతిచెందారు. కాగా గత 24 గంటల్లో కొత్తగా 959 మంది మరణించగా, 2,62,628 మంది కరోనా నుంచి కోలుకున్నారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 4.43 శాతం ఉన్నాయని తెలిపింది. అదేవిధంగా రోజువారీ పాజిటివిటీ రేటు 15.77 శాతంగా ఉందని పేర్కొన్నది.