మద్యం మత్తులో తల్లిన కడతేర్చిన కొడుకు

అమరావతి : కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో దారుణం చోటు చేసుకుంది. 3 రోజుల క్రితం మద్యం సేవించి తల్లి కంచుమోజు రమణ(55) ను కొడుకు రాంబాబు దాడి చేసి చితకబాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె నేడు తుదిశ్వాస విడిచింది. ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.