ముచ్చింతల్ ఆశ్రమాన్ని సందర్శించిన మంత్రులు

ముచ్చింతల్ ఆశ్రమాన్ని సందర్శించిన మంత్రులుహైదరాబాద్ : శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్న జీయర్ స్వామి ఆశ్రమాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ లు సందర్శించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ లు చినజీయర్ స్వామి ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం ముచ్చింతల్ ఆశ్రమంలో రామానుజ స్వామి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాల ఏర్పాట్లను వారు పర్యవేక్షించారు. రామనుజుడి సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న యాగశాలలో 1035 కుండ శ్రీలక్ష్మీ నారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ కార్యక్రమాల పనులను పరిశీలించారు. భద్రత ఏర్పాట్ల పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని తగు సూచనలు చేశారు.