మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు -కేటీఆర్

మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు -కేటీఆర్మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు -కేటీఆర్వరంగల్ టైమ్స్,ఆదిలాబాద్ జిల్లా: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి, మళ్లీ నువ్వు చిప్పకూడు తినే టైం వస్తుంది. తప్పకుండా ఆ రోజు నువ్వు తగిన శిక్ష అనుభవిస్తావు అంటూ కేటీఆర్ శాపనార్థాలు పెట్టారు. ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు ఇతర పార్టీ నేతలను ములాఖత్ ద్వారా మంగళవారం పరామర్శించారు. అనంతరం జైలు బయట కేటీఆర్ మీడియాతో మాట్టాడారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ని అరాచకాలు చేసినా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి ప్రజలు చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరించడం, దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇదే కాకుండా ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసే విధంగా అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలను, దుర్మార్గాలను మొత్తం రాష్ట్రం గమనించిందని కేటీఆర్ అన్నారు.

రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు ఖాకీ బుక్ మాత్రమే ఉంటుందని డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడిండు. మీ పోలీసుల బట్టలు ఉడదీసి కొడతానని ఒక కాంగ్రెస్ నాయకుడు అంటే కేసు పెట్టలేదు, మిమ్మల్ని యూజ్ లెస్ ఫెలోస్ అని ఒక బీజేపీ ఎంపీ అంటే కేసు పెట్టే ధైర్యం లేదు అని విమర్శించారు.రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కూడా పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొట్టాడు. రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు , ఖాకీ బుక్ ఉంటుందని అన్నారు. మరి ఈ రోజు ఖాకీ బుక్ ఎక్కడికి పోయిందని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. మీ పోలీసులు యూజ్ లెస్ ఫెల్లో అన్నబీజేపీ నాయకున్ని, బట్టలు ఊడదీసి కొడతా అన్న కాంగ్రెస్ నాయకునిపై ఎందుకు కేసు పెట్టడం లేదని కేటీఆర్ నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్లకు ఒక నీతి, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కు ఒక నీతి అనే విషయాన్ని డీజీపి తెలియచేశారని అన్నారు.

రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి గుర్తు పెట్టుకోండి.. ఎప్పడు అధికారం శాశ్వతం కాదు అని అన్నారు. రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది.. అప్పుడు మీరు ఏ కలుగులో దాక్కున్నా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదని,తగిన శిక్ష అనుభవిస్తారని హెచ్చరించారు. ఈరోజు చట్టాలను, ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే ప్రతి ఒక్కరిని వదిలిపెట్టకుండా ఎక్కడున్నా పట్టుకొని ఖచ్చితంగా శిక్షిస్తాం’అని కేటీఆర్ హెచ్చరించారు. వెంటనే క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ మున్సిపాలిటీలలో వెంటనే ఎన్నికలు పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.