వివాహ బంధంతో ఒక్కటైన రష్మిక-విజయ్ 

వివాహ బంధంతో ఒక్కటైన రష్మిక-విజయ్

-రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో ఘనంగా వివాహం
-ఇరు కుటుంబాల సంప్రదాయాల ప్రకారం వివాహం
-మార్చి 4న హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్వివాహ బంధంతో ఒక్కటైన రష్మిక-విజయ్ వరంగల్ టైమ్స్, రాజస్తాన్: టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎట్టకేలకు వివాహబంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమపై వస్తున్న వార్తలకు తెరదించారు. ఫిబ్రవరి 26, గురువారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో గల మెమెంటోస్ ప్యాలెస్ వేదికగా వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక సాగింది. ఈ వివాహ వేడుక రెండు విభిన్న సంస్కృతుల కలయికగా అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం విజయ్ కుటుంబ పద్దతిలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి తంతు పూర్తికాగా, సాయంత్రం 4.30 గంటలకు రష్మిక కుటుంబ ఆచారాల ప్రకారం (కొడవ) మరోసారి వివాహం నిర్వహించుకున్నారు.

వివాహం అనంతరం విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాలో పెళ్లి ఫోటోలను షేర్ చేసి, తన లవ్ స్టోరీని అభిమానులతో పంచుకున్నారు. “ఒకరోజు ఆమెను చాలా మిస్ అయ్యాను. తను నా పక్కనే ఉంటే బాగుంటుందని, తను ఎదురుగా ఉంటే నేను తినే భోజనానికి ఒక అర్థం ఉంటుందని గ్రహించాను. జిమ్ లో తను తోడుంటే ఆ కష్టం శిక్షలా కాకుండా సరదాగా అనిపించేది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే, మనశ్శాంతిని ఇచ్చే ఇల్లు అంటే తనే అని నాకు అర్థమైంది. అందుకే నా బెస్ట్ ఫ్రెండ్ నే నా భార్యగా చేసుకున్నాను” అని విజయ్ దేవరకొండ తన పెళ్లి విషయాన్ని అధికారికంగా తెలియచేశాడు. ఇక అటు రష్మిక కూడా ” నా భర్తను పరిచయం చేస్తున్నా” అంటూ పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకుంది.వివాహ బంధంతో ఒక్కటైన రష్మిక-విజయ్ “గీత గోవిందం”, “డియర్ కామ్రేడ్” సినిమాలతో వెండితెరపై మాయ చేసిన ఈ జంట, నిజ జీవితంలోనూ జంటగా మారడం పట్ల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. కొత్త పెళ్లి జంటకు నటీనటులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మార్చి 4న హైదరాబాద్ లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ స్థాయిలో వెడ్డింగ్ రిసెప్షన్ ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.