ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ ఇక భారత్ సొంతం

ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ ఇక భారత్ సొంతం

ఇజ్రాయెల్ 'ఐరన్ డోమ్' ఇక భారత్ సొంతంవరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో, ఇజ్రాయెల్ తన అత్యంత శక్తివంతమైన ‘ఐరన్ డీమ్’ మిస్సైల్ డిఫెన్స్ టెక్నాలజీని భారత్తో పంచుకోవడానికి అంగీకరించింది. ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ యానివ్ రేవచ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ ఒప్పందం ప్రకారం ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా భారత్లోనే సైనిక హార్డ్వేర్ను తయారు చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. పరస్పర సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో ఇరు దేశాల మధ్య ఈ రక్షణ ఒప్పందం వ్యూహాత్మకంగా చాలా కీలకంకానుంది. ఇజ్రాయెల్ గడ్డపైకి శత్రువులు ప్రయోగించే రాకెట్లు, డ్రోన్లు, మోర్టార్లను గాలిలోనే అడ్డుకుని వాటిని నిర్వీర్యం చేయడంలో ఐరన్ డోమ్ దిట్ట. 4 కిలో మీటర్ల నుంచి 70 కిలో మీటర్ల పరిధిలో వచ్చే స్వల్ప శ్రేణి లక్ష్యాలను ఇది సమర్థవంతంగా అడ్డుకుంటుంది. దీనిలోని రాడార్ వ్యవస్థ శత్రు రాకెట్లను గుర్తించి, అవి జనావాసాలపై పడతాయో లేదో లెక్కగడుతుంది. ప్రమాదకరమైన రాకెట్లపైకి మాత్రమే ఇంటర్ సెప్టర్ మిస్సైళ్లను ప్రయోగిస్తుంది. దీని సక్సెస్ రేటు 90 శాతంగా ఉండటం విశేషం.