ఇజ్రాయిల్ అద్భుత నిర్ణయం ? 

ఇజ్రాయిల్ అద్భుత నిర్ణయం ?

ఇజ్రాయిల్ అద్భుత నిర్ణయం ? వరంగల్ టైమ్స్,ఇంటర్నెట్ డెస్క్ : ఏ మాత్రం దేశాన్ని కించపరిచినా ఇక నుంచి ఇజ్రాయిల్ లో దేశ బహిష్కరణ తప్పదని ఇజ్రాయిల్ దేశం ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. సైన్యాన్ని ఇబ్బంది పెట్టే వారిని, దేశంపైన దాడి చేసే వారిని దేశ ద్రోహులుగా గుర్తిస్తూ దేశ బహిష్కరణ చేయాలని నిర్ణయించుకుంది. కానీ భారత దేశంలో మన దేశంలో ఉంటూ దేశంపై విషం చిమ్ముతూ, దుర్భాషలాడుతున్న చాలా మందిని అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇండియాలో దేశం గురించి నీచంగా మాట్లాడినా కనీసం అరెస్టు కూడా చేయలేని పరిస్థితి. ఏమైనా అంటే భావ ప్రకటనా స్వేచ్ఛ అంటూ ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడటం ఇండియాలో అలవాటైపోయింది. అలాంటి వారిపై భారత్ లో చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించవు.

ఇలాంటి ఒక ఘటన ఇజ్రాయిల్ దేశంలో జరిగింది. ఇజ్రాయిల్ సుప్రీం కోర్టులో ఆ దేశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇజ్రాయిల్ ప్రభుత్వం న్యాయవ్యవస్థలపై కీలకమైన సవరణలు చేసింది. కీలక చట్టం తీసుకొచ్చింది. దేశంలో ఉంటూ దేశ రక్షణ వ్యవస్థపై బురద చల్లాలని దేశంలో అలజడులు రేపాలని చూసే వారికి ఇదొక గుణపాఠం. ఏ మాత్రం దేశాన్ని కించపరిచినా ఇక నుంచి ఇజ్రాయిల్ లో దేశ బహిష్కరణ తప్పదు.