27న రైతు భరోసా-పీఎం కిసాన్‌ విడుదల 

27న రైతు భరోసా-పీఎం కిసాన్‌ విడుదల

వరంగల్ టైమ్స్, అమరావతి : ఏపీలో రైతు భరోసా-పీఎం కిసాన్‌ 13వ విడత సాయం ఈ నెల 27న విడుదలవుతుందని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌ తెలిపారు. మాండస్‌ తుఫాన్‌కు పంట నష్టపోయిన రైతులకు కూడా అదే రోజు రూ.76కోట్లు సీఎం జగన్‌ ద్వారా జమ చేయనున్నట్లు చెప్పారు. రబీ పంటలకు సంబంధించి ఈ-క్రాప్‌, ఈ-కేవైసీ ఈనెల 28లోగా చేయించుకోవాలని రైతులను కోరారు. నిన్న 26 జిల్లాల వ్యవసాయ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.