మార్చి 3న భద్రకాళి ఆలయం మూసివేత

మార్చి 3న భద్రకాళి ఆలయం మూసివేత

మార్చి 3న భద్రకాళి ఆలయం మూసివేతవరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా: స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర పాల్గుణ శు॥ పూర్ణిమ మంగళవారం మార్చి 03,2026 రోజున పుబ్బా నక్షత్రయుక్త కేతుగ్రస్తోదయ చంద్ర గ్రహణం సంభవిస్తుందని శ్రీ భద్రకాళి ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు, వేదపాఠశాల అధ్యాపకులు తాతాభట్ల నరసింహశర్మలు తెలిపారు. ఇది భారతదేశంలో అన్ని ప్రాంతాలలో కనబడుతుంది. గ్రహణం స్పర్శకాలం: మధ్యాహ్నం గం॥ 03-20ని॥లకు, మధ్యకాలం సాయంకాలం గం॥ 05-04ని॥లకు, మోక్షకాలం: సా॥ 06-45ని॥లకు, ఆధ్యంత పుణ్యకాలం:గం|| 03-20ని||లకు వుంటుందన్నారు. గ్రహణ వేద ఉదయం గం|| 08-00లకే ప్రారంభమౌతుంది, కాబట్టి మార్చి 03-03-2026 మంగళవారం రోజున ఉదయం గం॥ 07-00ల వరకే ఆ రోజు జరుపవలసిన పూజాదికములు నిర్వహింపబడి గం|| 07-30ని॥లకు ఆలయ ద్వారములు మూసివేయబడతాయని తెలిపారు. గ్రహణ మోక్షానంతరం అనగా రాత్రి గం|| 06-50ని॥లకు దేవాలయం ఆపాదమస్తకం శుద్ధిచేయబడిన పిమ్మట ఆ మరునాడు బుధవారం ఉదయం సూర్యోదయం తర్వాత సంప్రోక్షణాధికములు నిర్వహింపబడి పిమ్మట ఆలయ నిత్యాహ్నికం జరుపబడి భక్తుల ఆర్జిత సేవలు నిర్వహింపబడతాయని ఆలయ ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు, వేదపాఠశాల అధ్యాపకులు శ్రీ తాతాభట్ల నరసింహశర్మలు తెలిపారు. కావున భక్తులు ఇట్టి విషయాన్ని గమనించాలని వారు సూచించారు.