ఇరాన్ దాడికి..గాల్లోనే కూలిన ఎఫ్-15 ఫైటర్ జెట్
వరంగల్ టైమ్స్, ఇరాన్: పశ్చిమాసియాలో ఉద్రికత్తలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఇరాన్, అమెరికా మద్దతు కలిగిన ఇజ్రాయెల్ మధ్య దాడులు, ప్రతిదాడులు మూడో రోజుకు చేరుకున్నాయి. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా వైమానిక స్థావరాలున్న గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ క్షిపణి దాడులకు దిగింది. యూఏఈ, కువైట్, బహ్రెయిన్, ఖతార్ తదితర దేశాల్లోని అమెరికా బేస్‌లపై దాడులు చేసింది. కాగా, సోమవారం శత్రు దేశానికి చెందిన ఓ ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్టు ఇరాన్ ప్రకటించింది. కువైట్ గగనతలంలో ఎగురుతున్న ఒక ఎఫ్-15 ఫైటర్ జెట్‌ను తమ క్షిపణి వ్యవస్థతో కూల్చివేసినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇరాన్ విడుదల చేసింది.














